అప్పుడప్పుడు మదిలో దొరలే ఆలోచనలను హాస్యరూపం లో మలచడమే ఈ చిన్న ప్రయత్నం.
ప్రస్తుతం వార్తలలో నలుగుతున్న అంశం కందిపప్పు, కందిపప్పు పై కొన్ని జోకులు ---
పెళ్ళిళ్ళ పేరయ్య ఆడ పిల్ల తండ్రి తో అంటున్నాడు -
పెళ్ళిళ్ళ పేరయ్య - పరంధామయ్య గారు మగ పెళ్ళివారు మీరు కట్నం కింద ఇస్తామన్న 100 సవర్ల బంగారంవద్దంటున్నారు, దానికి బదులు గా పది కిలోల కంది పప్పు ఇస్తే చాలంటున్నారు.
పరంధామయ్య - కందిపప్పు ఇచ్చే స్తోమతే వుంటే ఈ సంబంధము ఎందుకు చూస్తాను, ఎ టాటా నో బిర్లానో వియ్యంకుడిగా చేసుకొనే వాడిని.
-----------
నగలు కుదువ పెట్టడానికి వచ్చిన రైతు తో నగల వ్యాపారి ఇలా అంటున్నాడు
నగల వ్యాపారి - అయ్యా నగలు కుదువ పెట్టుకొనే రోజులు పోయినాయి మీకు డబ్బు కావాలంటే ఒక కిలో కందిపప్పుతీసుకొని రండి మీకు ఎంత డబ్బుకావలంటే అంత ఇస్తాము. నగలు మాత్రం తీసుకొనేది లేదు.
రైతు - ఆ కందిపప్పే వుంటే నీదగ్గరికి ఎందుకు వస్తాను బాబూ, నీలాగే నగల వ్యాపారం మొదలెట్టేవాడిని
----------
ఒక ప్రముఖ దినపత్రిక లో వార్తలు - - -
ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ అనిల్ ముఖేష్ ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఏభై కిలోల బంగారు కిరీటాన్నిసమర్పించారు, ఇందులో వజ్రాలకు బదులుగా అత్యంత విలువైన కంది పప్పు పొదగడం విశేషం. ఇంత విలువైన కానుకస్వామి వారికి ఈ మధ్య కాలం లో ఎవ్వరు ఇవ్వలేదని ఆలయ ధర్మకర్తలు అన్నారు
---------
ఇల్లు దోచుకోడానికి వచ్చిన దొంగలతో ఇంటి యజమాని - -
బాబ్బాబు ఇదుగో ఈ డబ్బు నగలు అన్ని తీసుకో మమ్మల్నేమి చెయ్యకు
దొంగ - ముష్టి నగలు ఎవడికి కావాలి బ్రతుకు మీద ఆశ వుంటే కందిపప్పు ఎక్కడ దాచారో చెప్పండి.
-----------
ఒక బ్యాంకు వద్ద ప్రకటన ---
ఇచట కందిపప్పు పై రుణాలు ఇవ్వబడును, కంది పప్పుకు లాకర్ సౌకర్యమ్ కలదు.
- - - - - - - -
Subscribe to:
Post Comments (Atom)



good jokes on current situation n prices of pulces.
ReplyDeleteDayakar
Good stuff. More such satires needed on other contemporary issues also.
ReplyDeleteMahesh Kumar L
Good stuff. More such satires needed on other contemporary issues as well.
ReplyDeleteMahesh Lagisetty